Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్ సుధాకర్‌ను మా ఎదుట హాజరుపరచండి : హైకోర్టు ఆర్డర్

Dr Sudhakar
Webdunia
మంగళవారం, 19 మే 2020 (12:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేసి సస్పెండ్‌కు గురైన డాక్టర్ సుధాకర్‌ను తమ ముందు హాజరుపరచాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. జైల్లో ఉన్న తన కుమారుడిని చూసేందుకు పోలీసులు, జైలు అధికారులు అనుమతించడం లేదంటూ సుధాకర్ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు మేరకు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. అలాగే, సుధాకర్ తల్లి చేసిన ఆరోపణలపై కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ సర్కారును ఆదేశించింది. అలాగే, వీరారెడ్డిని అనే వ్యక్తిని అమికస్ క్యూరీగా హైకోర్టు నియమించింది. 
 
కాగా, ఇటీవల వైజాగ్ పోలీసులు డాక్టర్ సుధాకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన విషయం తెల్సిందే. మద్యం సేవించి జాతీయ రహదారిపై నానా యాగీ చేస్తున్నారనీ, పలువురిపై చేయి చేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ముఖ్యంగా, డాక్టర్ సుధాకర్ చేతులు వెనక్కి విరిచి కట్టేసి, గుండు చేయించి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో విజువల్స్ మీడియాలో ప్రసారమయ్యాయి. 
 
ఇదే అంశంపై టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా హైకోర్టుకు ఓ లేఖ రాశారు. డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు, ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని సుమోటాగా స్వీకరించాలని ఆమె కోరారు. ఈ నేపథ్యంలో సుధాకర్ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. బాధిత వైద్యుడిని తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది. 
 
కాగా, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో వైద్యుడుగా పని చేస్తూ వచ్చిన డాక్టర్ సుధాకర్ ఏపీ సర్కారుపై సంచలన ఆరోపణలు చేశారు. కరోనా రోగులకు వైద్యం చేసేందుకు కనీసం ఎన్-95 రకం మాస్కులు, పీపీఈ కిట్లు కూడా ఇవ్వడంలేదంటూ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments