Webdunia - Bharat's app for daily news and videos

Install App

టేబుల్‌పైకెక్కి నిరసన తెలుపుతారా? వచ్చి వివరణ ఇవ్వండి... వైకాపా ఎమ్మెల్యేలకు ప్రివిలేజ్ కమిటీ పిలుపు

వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీచేసింది. వీరంతా ఈ నెల 25, 26 తేదీల్లో కమిటీ ముందు హాజరు కావ

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (15:45 IST)
వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీచేసింది. వీరంతా ఈ నెల 25, 26 తేదీల్లో కమిటీ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. 
 
ఇటీవల జరిగిన ప్రత్యేక సమావేశాల సందర్భంగా, ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శ టేబుల్‌పైకెక్కి నిరసన తెలపడమేకాక, స్పీకర్ పోడియం వద్ద కూడా గందరగోళం చేశారు. అసెంబ్లీ కార్యదర్శి టేబుల్‌పైకి ఎక్కి నిరసన తెలపడాన్ని ప్రివిలేజ్ కమిటీ తీవ్రంగా పరిగణిస్తోంది. 
 
ఈ నేపథ్యంలోనే, వీరికి ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఒక్కోరోజు ఆరుగురు ఎమ్మెల్యేలు కమిటీ ముందు హాజరై, తమ ప్రవర్తన పట్ల వివరణ ఇవ్వాలని నోటీసులో కమిటీ ఆదేశించింది. ప్రత్యేక హోదాకు సంబంధించి సభలో ప్రత్యేక చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ వీరు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. 
 
కాగా, నోటీసులు జారీ అయిన వైకాపా ఎమ్మెల్లో కంబాల జోగులు, కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్ కుమార్, ముత్యాలనాయుడు, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దాడిశెట్టి రాజయ్య, కొరుముట్ల శ్రీనివాసులు, చెర్ల జగ్గిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, కొడాలి నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు ఉన్నారు. 

మీ ఫోనులో వెబ్‌దునియా తెలుగు వార్తలు, సినిమా, ఇంకా మరిన్ని విశేషాలు... మరింత వేగంగా పొందేందుకు Mobile APP డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments