Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారికంగా విద్యుత్ కోతలు రావొచ్చు...క‌రెంటు పొదుపు చేయండి

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (17:27 IST)
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  విద్యుత్ అంశంపై స్పందించారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. బొగ్గు కొరత, ధరల పెరుగుదల వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని తెలిపారు. డబ్బు ఖర్చు చేసినా ఈ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి లేదని నిస్సహాయత వ్యక్తం చేశారు. విద్యుత్ అంశంపై కేంద్రమంత్రి చెప్పింది అవాస్తవం అని సజ్జల అన్నారు. సీఎం ఇప్పటికే ఈ సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని స్పష్టం చేశారు.
 
 భవిష్యత్తులో అధికారికంగా కోతలు రావొచ్చని వివరించారు. ఇళ్లలో విద్యుత్ వాడకం తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు రాత్రి 6 గంటల నుంచి 10 గంటల మధ్య విద్యుత్ వినియోగం తగ్గించాలని సూచించారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల కూడా సజ్జల వివరణ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణానికి హైకోర్టు తీర్పు శరాఘాతంలా మారిందని అన్నారు. అఫిడవిట్లు వేయించడం ద్వారా ఇళ్ల నిర్మాణాన్ని టీడీపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. లబ్దిదారులకు తెలియకుండానే కేసులు పెడుతున్నారని వివరించారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ కు వెళతామని వెల్లడించారు. డివిజన్ బెంచ్ లో ప్రభుత్వానికి న్యాయం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళాప్రపూర్ణ కాంతరావు 101వ జయంతి వేడుకలు

ఎక్కడికీ పారిపోలేదు.. ఇంట్లోనే ఉన్నా.. పోలీసులకు బాగా సహకరించా : నటి కస్తూరి

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు గౌరవ డాక్టరేట్ తో సత్కారం

మహారాష్ట్రలో సాంగ్ షూట్ లో సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా!

సారంగపాణి జాతకం చేతి రేఖల్లో వుందా? చేతల్లో ఉందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments