Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్సనా టిక్కెట్ల విడుదల వాయిదా? ఎందుకో తెలుసా..?

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (14:17 IST)
పరిమిత సంఖ్యలోనే ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్సనార్థం టిటిడి టోకెన్లను భక్తులకు అందిస్తోంది. అది కూడా ఆన్లైన్ ద్వారానే టోకెన్లను అందిస్తూ వస్తోంది. ఆఫ్ లైన్ ద్వారా అంటే కౌంటర్ల ద్వారా ఎక్కడా టోకెన్లను ఇవ్వడం లేదు. విఐపిలైతే నేరుగా తిరుమలకు వెళ్ళి జెఈఓ కార్యాలయంలో టోకెన్లను పొందాల్సి ఉంటుంది.
 
గత కొన్ని నెలలుగా కరోనా కారణంగా టోకెన్లను ఆన్ లైన్లో పరిమిత సంఖ్యలో అందిస్తోన్న టిటిడి ఇప్పుడు ఉన్నట్లుండి టోకెన్లను వాయిదా వేయాలన్న నిర్ణయం తీసుకుంది. అది కూడా సెప్టెంబరు నెలకు విడుదల చేయాల్సిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్సనా టిక్కెట్లను వాయిదా వేసింది.
 
ప్రతినెలా 20వ తేదీన మరుసటి నెలకు సంబంధించిన ప్రవేశ దర్సనా టిక్కెట్లను టిటిడి ఆన్ లైన్లో విడుదల చేస్తూ వస్తోంది. సెప్టెంబర్ నెల దర్సన టిక్కెట్ల విడుదల తేదీని త్వరలో తెలియజేస్తామని ఇప్పటికే టిటిడి ఒక ప్రకటన విడుదల చేసింది.
 
అయితే టిటిడి ఈ ప్రకటన విడుదల చేయడానికి ఒక కారణం కూడా ఉందట. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ సమయాన్ని బాగా తగ్గించడం.. ఎక్కడా పెద్దగా ఆంక్షలు లేకపోవడం.. కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టడంతో భక్తులకు టోకెన్ల సంఖ్యను పెంచాలన్న ఆలోచనలో కూడా టిటిడి ఉందట.
 
ఈ పదిరోజుల పాటు ఆలోచించి.. కేసుల సంఖ్య పెరుగుతుందా లేదా చూసుకుని ఆ తరువాత టోకెన్లను ఆన్ లైన్లో పెంచాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారట. అందుకే ప్రస్తుతానికి టోకెన్ల విడుదలను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments