Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాతకక్షలు ప్రాణం తీసింది.. భోజనం చేస్తుండగా చంపేశారు.. ఎలా?

పాతకక్షలు ఓ వ్యక్తి ప్రాణాల్ని తీశాయి. పొన్నూరు మండలం జూపూడి గ్రామంలో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూపూడి గ్రామానికిచెందిన తాడిశెట్టి కృష్ణ(45)కు అద

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (09:54 IST)
పాతకక్షలు ఓ వ్యక్తి ప్రాణాల్ని తీశాయి. పొన్నూరు మండలం జూపూడి గ్రామంలో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. జూపూడి గ్రామానికిచెందిన తాడిశెట్టి కృష్ణ(45)కు అదే గ్రామానికి గండికోట నరసింహారావు, శ్రీనివాసరావు, తాడిశెట్టి హరిబాబు తదితరులతో పాత గొడవలు ఉన్నాయి. గత పది రోజుల నుంచి వీరి కుటుంబాలకు చెందిన సభ్యుల మధ్య స్వల్ప వివాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. 
 
ఈ నేపథ్యంలో సోమవారం తాడిశెట్టి పొలం పనులకు వెళ్లే నిమిత్తం స్వగృహంలో భోజనం చేస్తుండగా గండికోట నరసింహారావు, శ్రీనివాసరావు, మరి కొందరు కృష్ణ ఇంటిపై దాడిచేశారు. కృష్ణను కర్రలు, రాడ్లు, బరిసెలతో కొట్టుకుంటూ ఇంటి వెనుకవైపునకు తీసుకువెళ్ళినట్లు మృతుడి బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరి దాడిలో తీవ్రంగా గాయపడి రక్తస్రావమైన కృష్ణను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించే క్రమంలో పరిస్థితి విషమించి మృతిచెందినట్లు పోలీసులు చెప్పారు.
 
గ్రామంలో ప్రజలందరూ చూస్తుండగానే దాడి జరగటంతో ఒక్కసారిగా భీతావహ వాతావరణం నెలకొంది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments