Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు బెయిల్ మంజూరు చేయగానే మాచర్లలో ప్రత్యక్షమైన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి!!

ఠాగూర్
బుధవారం, 29 మే 2024 (12:40 IST)
ఈ నెల 13వ తేదీన ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న అధికార వైకాపా, మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఉపశమనం లభించింది. ఆయనపై ఏపీ పోలీసులు నమోదు చేసిన మరో మూడు కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ వెంటనే ఆయన నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. ఆయనపై నమోదైన కేసుల్లో జూన్ ఆరో తేదీ వరకు అరెస్టు చేయొద్దంటూ మంగళవారం మధ్యాహ్నం ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఆదేశాలు జారీ అయిన కొన్ని నిమిషాల్లోనే ప్రత్యక్షమయ్యారు. 
 
ఆ తర్వాత రాత్రి 9 గంటల సమయంలో నరసరావుపేట చేరుకున్న ఆయన స్థానికంగా ఓ హోటల్లో బస చేశారు. ప్రతి రోజూ ఎస్పీ ఎదుట హాజరు కావాలన్న కోర్టు షరతు ప్రకారం రాత్రి 12 గంటల సమయంలో పల్నాడు ఎస్పీ మలికా గార్గ్ ఎదుట హాజరయ్యారు. ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసిన వీడియో ఈ నెల 21న వెలుగులోకి వచ్చింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఈసీ ఆయనను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. అప్పటికే ఆయన పరారైనట్టు గుర్తించిన పోలీసులు పిన్నెల్లి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఆయన చిక్కలేదు.
 
ఈ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా అరెస్టు చేయవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. అయితే, ఆయనపై హత్యాయత్నం, అల్లర్లు, దాడులు, బెదిరింపులు తదితర అభియోగాలపై నమోదైన కేసుల్లో అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన ఆయన అజ్ఞాతం వీడలేదు. తాజాగా ఆ కేసుల్లోనూ ఉపశమనం లభించడంతో బయటకు వచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments