Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనితపై అభ్యంతరకర పోస్టులు.. పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ మళ్లీ అరెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఇటీవల పెద్ద ఎత్తున సెటైర్లు పేలాయి. ఆ సమయంలోనే చట్టసభపై పొలిటికల్ పంచ్ అడ్మిన్ ఇంటూరి రవికిరణ్ పోస్టింగ

Webdunia
మంగళవారం, 9 మే 2017 (17:46 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఇటీవల పెద్ద ఎత్తున సెటైర్లు పేలాయి. ఆ సమయంలోనే చట్టసభపై పొలిటికల్ పంచ్ అడ్మిన్ ఇంటూరి రవికిరణ్ పోస్టింగులు పెట్టారు. దీంతో గుంటూరు పోలీసులు రవికిరణ్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఆపై రవికిరణ్ అరెస్టుపై సోషల్ మీడియాలో నెటిజన్లు నిరసన తెలపడంతో కొన్ని గంటలు తర్వాత పోలీసులు ఆయన్ని వదిలేశారు. 
 
తాజాగా రవికిరణ్‌ను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. తనను కించపరిచేలా పోస్టింగులు పెట్టారంటూ టీడీపీ ఎమ్మెల్యే అనిత ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదయింది. ఈ కేసు విచారణ అనంతరం రవికిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
కాగా.. రవికిరణ్‌ ఏపీ మండలి కార్యాలయంపై అభ్యంతరకర ఫోటోలు పెట్టారని.. అలాగే, ఎమ్మెల్యే అనిత, మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు వంటి వారిపై అనుచిత పోస్టింగులు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఏప్రిల్ 19వ తేదీన అనిత రవికిరణ్‌పై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి రవికిరణ్ వద్ద పోలీసులు విచారణ జరిపారు. రవికిరణ్‌తో పాటు వైసీపీ ఐటీ వింగ్ చీఫ్‌ను కూడా పోలీసులు విచారించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments