Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని టీడీపీ జాతీయ కార్యాలయానికి నోటీస్

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (15:03 IST)
మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యాల‌యంపై దాడి కేసులో ఏపీ పోలీసులు ఆ పార్టీకి నోటీసులు జారీ చేశారు. దాడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ త‌మ‌కు ఇవ్వాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని కోరారు. 
 
 తెదేపా పార్టీ కేంద్ర కార్యాలయంపై దుండగుల దాడి ఘటన అనంతరం కార్యాలయ ఉద్యోగి బద్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. త‌మ కార్యాల‌యంపై వైసీపీ కార్య‌క‌ర్త‌లు మూకుమ్మ‌డిగా దాడి చేసి ఫ‌ర్నీచ‌ర్ ధ్వంసం చేశార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే, కొంద‌రు కార్యాల‌య సిబ్బందిపై కూడా దాడి చేసి, వారిని క‌ర్ర‌ల‌తో కొట్టార‌ని వివ‌రించారు. కొన్ని కార్లు కూడా ధ్వంసం చేశార‌ని, సుత్తులు, క‌ర్ర‌లు, ఇత‌ర మార‌ణాయుధాల‌తో వ‌చ్చార‌ని పేర్కొన్నారు. 
 
కార్యాల‌య ఉద్యోగి బ‌ద్రి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కార్యాలయ రిసెప్షన్ కమిటీ సభ్యుడు కుమారస్వామికి నోటీసులు జారీ చేశారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలలోగా వివరాలు అందజేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం గోడకు పోలీసులు నోటీసులు అంటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌‌కి పవన్ కళ్యాణ్ పరోక్షంగా పంచ్ ఇచ్చిపడేశారా? (Video)

జనసేన పార్టీకి దిల్ రాజు ఇం'ధనం'గా ఉన్నారు : పవన్ కళ్యాణ్

అకీరా నందన్ సినిమా ఎంట్రీపై నిర్ణయం వాడిదే : రేణూ దేశాయ్

విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసింది: రేణూ దేశాయ్

'గేమ్ ఛేంజర్‌'కు రూ.600 - 'డాకు మహారాజ్‌'కు రూ.500 బెనిఫిట్ షో టిక్కెట్ ధర ఖరారు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments