Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామాలయంలో క్రైస్తవ భజనలు: అసత్య ప్రచారం నమ్మొద్దు

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (17:48 IST)
తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రామచంద్రాపురం సమీపంలోని పామర్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని కె.గంగవరం గ్రామంలోని రామాలయంలో క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రార్థనలు జరిగినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. 
 
దీనిపై జిల్లా వ్యాప్తంగా దుమారం రేగడంతో విషయం పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై విచారణ జరిపిన జిల్లా ఎస్పీ రవీంథ్రనాథ్ బాబు క్లారిటీ ఇచ్చారు. గంగవరం గ్రామంలో కాదా మంగాయమ్మ అనే మహిళ గత కొన్ని సంవత్సరాల నుంచి తన ఇంటి ముందు ఉన్న రోడ్డు మీద ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు.
 
అదే రోడ్డుకి ఆనుకుని ఉన్న రామాలయంలో నిత్యం పూజలు జరుగుతుంటాయని ఈ విషయంలో స్థానిక హిందువులకు, క్రిస్టియన్లకు కలసిమెలసి ఉంటున్నారని, ఎటువంటి వివాదాలు లేవని స్పష్టం చేశారు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. దీనిపై గ్రామంలో విచారణ జరిపిన పోలీసులు అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రజలు అసత్య ప్రచారం నమ్మొద్దని తెలిపారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments