Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ ధ‌రించ‌ని మ‌హిళ‌ల‌కు పోలీసుల క్లాస్!

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (11:10 IST)
బ‌య‌ట ఎక్కువ‌గా తిరిగేది మ‌గ‌వాళ్ళే... వాళ్ళు అజాగ్ర‌త్త‌గా ఉంటార‌ని అంద‌రూ అంటుంటారు. క‌రోనాపై అస‌లు కేర్ తీసుకోర‌ని భావిస్తుంటారు. కానీ, మ‌హిళ‌లే ఎక్కువ అల‌స‌త్వం వ‌హిస్తున్నార‌ని, వాళ్ళు ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేట‌పుడు అస‌లు మాస్క్ ధ‌రించ‌డం లేద‌ని అంటున్నారు... పోలీసులు.

ఎందుకంటే, వెహిక‌ల్ చెకింగ్ లో ఎక్కువ‌గా మాస్క్ లేని మ‌హిల‌లే ప‌ట్టుప‌డుతున్నారు. విజ‌య‌వాడ శివారు గొల్లపూడిలో వెహికల్ చెకింగ్ చేస్తుంటే, క‌నిపించిన దృశ్యాలివి.

విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, ఆదేశాల మేరకు భవాని పురం పోలీస్ స్టేషన్ పరిధిలో గొల్లపూడి వన్ సెంటర్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించిన ఎస్ ఐ. ఎం వి వి రవీంద్ర బాబు వాహనాల తనిఖీల నిర్వహణ లో గొల్లపూడి ప్రాంతవాసులు, ముఖ్యంగా మహిళలు ఎక్కువగా మాస్కులు ధరించక పోవడంతో, వారందరి వాహనాలు ఆపి, ఎస్ఐ రవీంద్రబాబు, కరోనా వైరస్ పై ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి వాహనాల రికార్డులు తనిఖీలు నిర్వహించి చలనాలు విధించారు.

ఇంట్లో ఉన్న‌పుడు ఎలాగూ మాస్క్ ధ‌రించ‌డం లేద‌ని, ఇంటి బ‌య‌ట‌కు వ‌చ్చినా అదేలా అశ్ర‌ద్ధ వ‌హించ‌డం త‌గ‌ద‌ని పేర్కొన్నారు. క‌రోనాకు ఎటువంటి బేధం లేద‌ని, అంద‌రినీ అది కాటేస్తుంద‌ని వివ‌రించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ ఎం వి వి రవీంద్రబాబు, హెడ్ కానిస్టేబుల్ నాగేంద్రం, మహిళా కానిస్టేబుల్ శోభిత, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అంటున్న డకాయిట్ టీమ్

వైలెంట్ - సైలెంట్ ప్రేమకథ - ఫ్లాప్ వచ్చిన ప్రతిసారీ మారాలనుకుంటా : అల్లరి నరేష్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments