Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ నన్ను చంపేస్తానన్నారు... ఎవరు?

Webdunia
సోమవారం, 12 ఆగస్టు 2019 (18:26 IST)
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి జమీన్ రైతు వారపత్రిక అధినేత డోలేంద్ర ప్రసాద్ మీద కోటంరెడ్డి దాడి చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోటం రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
కాగా.. ఓ పత్రికాధినేతపై కోటంరెడ్డి వ్యవహరించిన తీరుపై టీడీపీ, బీజేపీ, సీపీఎం పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మీడియాపై దాడులకు నిరసనగా జర్నలిస్ట్ సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాయి. కోటం రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పలువురు జర్నలిస్ట్ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. 
 
కాగా నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కూడా కోటంరెడ్డిపై సీఎం జగన్‌కి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తనపై దాడి చేశారని జమీన్ రైతు వారపత్రిక ఎడిటర్ డోలేంద్ర ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి 7గంటల 30 నిమిషాలకు కోటంరెడ్డి మాగుంట లేఅవుట్‌లో ఉన్న తన ఇంటికి మద్యం తాగి వచ్చారని డోలేంద్ర చెప్పారు. 
 
ఈ క్రమంలో ఎమ్మెల్యే సొంత ఊరికి చెందిన డాక్టర్ వసుంధర తనతో మాట్లాడి బయటకు వస్తున్న సమయంలో ఎమ్మెల్యే ఆమె చేయి పట్టుకొని ఇంట్లోకి లాక్కొచ్చారని చెప్పారు. ఎమ్మెల్యేపై వార్తలు రాసినందుకు తనపై తీవ్రస్థాయిలో మండిపడినట్లు చెప్పారు. చంపేస్తానని బెదిరించారని తెలిపారు. తాను అధికార పార్టీ ఎమ్మెల్యే అని తనను ఎవరూ ఏమీ పీకలేరని.. మంత్రితో, ముఖ్యమంత్రి జగన్‌తో చెప్పుకున్నా కూడా తనను ఎవరూ ఏమీ చేయలేరని బెదిరించినట్లు చెప్పారు

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments