Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైత్వానీపై అక్రమ కేసు : వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ అరెస్టు... జైలుకు తరలింపు

ఠాగూర్
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (10:59 IST)
ముంబై నటి కాదంబరి జైత్వానీనిపై అక్రమ కేసు పెట్టి, శారీరకంగా, లైంగికంగా వేధించిన కేసులో వైకాపా నేత కుక్కల విద్యాసాగర్‌ను ఏపీ పోలీసులు డెహ్రాడూన్‌లో అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత ఆయనకు కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు జైలుకు తరలించారు. 
 
ఏపీలో సంచలనంగా మారిన ముంబై నటి కాదంబరి జైత్వానీని వేధించిన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాదంబరి కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చాక విద్యాసాగర్ అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కొన్నిరోజులు ముంబైలో, మరికొన్ని రోజులు ఢిల్లీలో తలదాచుకున్నారని పోలీసులు గుర్తించారు. చివరకు డెహ్రాడూన్‌లోని ఓ రిసార్ట్ వద్ద అరెస్టు చేశారు. అక్కడి మూడో అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకువచ్చారు.
 
తనపై తప్పుడు కేసు నమోదు చేసి మానసికంగా వేధించారని కుక్కల విద్యాసాగర్‌తో పాటు ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌ గున్నీ, పలువురు పోలీసు అధికారులపై జైత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఈ నెల 13న కేసు నమోదు చేశారు. ఇందులో కుక్కల విద్యాసాగర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. 
 
జైత్వానీ విజయవాడకు వచ్చి వాంగ్మూలం ఇచ్చినప్పటి నుంచి విద్యాసాగర్ పరారీలో ఉన్నారు. తాను నమోదు చేయించిన కేసుకు సంబంధించిన వివరాలు మీడియాలో ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా కాదంబరి వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఉన్నతాధికారులు విచారణాధికారిని నియమించారు. ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్‌లోని ఏసీపీ స్రవంతిరాయ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆమె కాదంబరితో పాటు తండ్రి నరేంద్రకుమార్ జెత్వానీ, తల్లి ఆశా జైత్వానీ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. 100 పేజీలతో విచారణ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి పంపారు. 
 
కాదంబరి మొత్తం నాలుగుసార్లు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మూడుసార్లు పోలీసు కమిషనర్‌కు, నాలుగోసారి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అజ్ఞాతంలోకి వెళ్లిన విద్యాసాగర్‌ను పట్టుకోవడానికి పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను నియమించారు. ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లిలో పెళ్లి టైటిల్ చాలా ఆసక్తికరంగా వుంది : తనికెళ్ళ భరణి

అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు : స్మృతి ఇరానీ

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం