Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాస్టిక్ రైస్ ఉందా? శ్రీవారి భక్తులకు వడ్డిస్తున్నారట..?

'అన్నం పరబ్రహ్మ స్వరూపం'.. అన్నదానానికి మించిన దానం లేదంటారు. ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో అన్నానికి అంత విలువ ఇస్తారు. రానురాను పాశ్చాత్య కల్చర్ వైపు పరుగులు పెడుతున్న మన దేశంలో అనేక విషయాల్లో ఇప్పట

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2017 (12:23 IST)
'అన్నం పరబ్రహ్మ స్వరూపం'.. అన్నదానానికి మించిన దానం లేదంటారు. ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో అన్నానికి అంత విలువ ఇస్తారు. రానురాను పాశ్చాత్య కల్చర్ వైపు పరుగులు పెడుతున్న మన దేశంలో అనేక విషయాల్లో ఇప్పటికే ఆ కల్చర్ వచ్చేసింది. మూడు పూటలు కాదు కదా రోజుకు కనీసం రెండు పూటలా రై
స్ తినడానికి కూడా ఆశక్తి చూపడం లేదు చాలామంది. ఇతర జంక్ ఫుడ్‌లు తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. పొలాల్లో పండే వరి పంట ద్వారా వచ్చిన రైతును అన్నంగా మార్చుకుని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అలాంటి బియ్యంలో అనేక రకాల కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. ఇదంతా చాలామందికి తెలిసిన విషయమే అయినా ప్లాస్టిక్ రైస్ మార్కెట్‌లోకి వచ్చింది అన్న ఒక తప్పుడు ప్రచారాన్ని జనాలు చాలామంది నమ్మేస్తున్నారు. దానిపైన ఇప్పటికే రకరకాల రాద్ధాంతాలు జరిగిపోతున్నాయి. అసలు ఇంతకీ ప్లాస్టిక్‌తో రైస్ తయారు చేయడం సాధ్యమేనా. ఒకవేళ తయారు చేసి మార్కెట్‌లో అమ్మినా వాటిని గుర్తించగలరా? ఈజీగా గుర్తించవచ్చు. కానీ ఎవరో చెప్పిన మాటలను నమ్మి ప్లాస్టిక్ రైస్ ప్లాస్టిక్ రైస్ అంటూ జనాలను భయపెడుతున్నారు. అసలు ప్లాస్టిక్ రైస్ ఉంటుందా లేదా అన్న విషయాలపై డాక్టర్లు చాలా స్పష్టత ఇస్తున్నారు. 
 
చైనా, ఈజిప్టు లాంటి దేశాల్లో ఇలాంటి రైస్ అందుబాటులో ఉందని అయినా కూడా అది ప్లాస్టిక్ రైస్ కాదంటూ చెబుతున్నారు వైద్యులు. మన దేశంలో ధాన్యం ఎక్కువగా పండిస్తారు.. వరి ధాన్యానికి సంబంధించి అనేక దేశాలకు మనమే ఎక్కువగా ఎగుమతి చేస్తుంటాం. దీంతో రైస్ అనేది మన దేశంలో సరసమైన ధరలకు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ నిజంగా ప్లాస్టిక్ రైస్ తెచ్చినా వాటి తయారీకి అయ్యే ఖర్చు బేరీజు వేసుకుంటే మార్కెట్‌లో ఉన్న నిజమైన రైస్ కంటే ఇది ఎక్కువ రేటు ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ బియ్యాన్ని వ్యాపారస్తులు అందుబాటులో ఉంచరు. మన దేశంలో ఇప్పటివరకు ఎక్కడా నిజమైన ప్లాస్టిక్ బియ్యం బయటపడిన సంఘటనలు లేవంటున్నారు వైద్యులు. అలా ఎవరైనా అపోహ పెడితే వారి మాటలు నమ్మద్దంటున్నారు. తిరుపతిలో కూడా ప్లాస్టిక్ రైస్‌ను భక్తులకు హోటళ్ళలో వడ్డిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటివి ఏమీ లేదని వదంతులను అస్సలు నమ్మవద్దంటున్నారు వైద్యులు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments