Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 4న మా దేవుడు పిఠాపురంలో అడుగు పెడుతున్నాడు.. పిఠాపురం ఓటర్లు

ఠాగూర్
గురువారం, 23 మే 2024 (17:33 IST)
జూన్ నాలుగో తేదీన మాకు పెద్ద పండుగే అని అంటున్నారు పిఠాపురం వాసులు. ఆ రోజున మా దేవుడు పిఠాపురంలో అడుగుపెడుతున్నాడు అని వారు అంటున్నారు. ఆ రోజున మా ఊరికి పెద్ద పండుగే. మేకలు లెగుస్తాయో, కోడులు లెగుస్తాయో తెలియదు.. ఆ రోజు మాకు పండగే. మా దేవుడు పిఠాపురంలో అడుగుపెడుతున్నాడు అని పిఠాపురం ఓటర్లు ఉంటారు. 
 
ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. అధికార వైకాపా తరపున వంగా గీత పోటీ చేశారు. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరిగింది. ఇందులో వార్ వన్‌సైడ్ అన్నట్టుగా పోలింగ్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు 2.30 లక్షల ఓట్లకు గాను, 2.10 లక్షల ఓట్ల వరకు పోలైయ్యాయి. 
 
వీటిలో 80 నుంచి 90 శాతం ఓట్లు ఒక్క పవన్‌కు పడినట్టు పిఠాపురం వాసులు చెపుతున్నారు. పైగా తమ జీవితకాలంలో అభిమానంతో ఓటు వేయడం అనేది మేం పుట్టాక ఎన్నడూ చూడలేదని, ఈ ఎన్నికల్లో మాత్రం పిఠాపురంలో చూశామని, అది కూడా మా దేవుడు పవన్ కోసం ఓటు వేశామని చెప్పారు. పిఠాపురం ప్రజలు చెబుతున్నట్టు ప్రజలంతా పవన్‌కు ఓటు వేస్తే మాత్రం ఆయనకు వచ్చే మెజార్టీ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా రికార్డుపుటలకెక్కనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాధాభాయ్ సాంగ్ లో మన్నారా చోప్రా మాస్ డ్యాన్స్ మూమెంట్స్

నేడు సినీ పరిశ్రమ తరఫున అభినందనలు మాత్రమే - మరోసారి సమస్యలపై చర్చ

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌తో టాలీవుడ్ నిర్మాతల భేటీ!

పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన అగ్ర నిర్మాతలు - చిన్న నిర్మాతలు అలక

కళ్యాణ్ రామ్‌ యాక్షన్‌ చిత్రంలో విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments