ఆర్-5 జోన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన అమరావతి రైతులు

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (14:43 IST)
అమరావతి ప్రాంతంలో ఆర్-5 జోన్ వ్యవహారంపై అమరావతి ప్రాంత రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి చంద్రసూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఈ నెల 14వ తేదీన విచారణకు రానుంది. ఈ పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు దాఖలు చేశారు. 
 
వాస్తవానికి ఈ నెల 10న విచారణకు తీసుకోవాలని రైతుల తరపున న్యాయవాది కోరగా.. ఆరోజు కేసుల జాబితా ఇప్పటికే తయారైందని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తెలిపారు. అందుకే ఈ పిటిషన్‌ను 14వ తేదీన విచారణకు తీసుకుంటామని చెప్పారు. అమరావతి రైతులు ఆర్‌-5 జోన్‌పై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
అయితే ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలోని 900 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా బృహత్‌ ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌)లో మార్పులు చేస్తూ ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments