Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి పెద్దిరెడ్డికి కరోనా పాజిటివ్, ఎక్కడ ఉన్నారంటే?

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (20:19 IST)
పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనావైరస్ సోకింది. కరోనాతో ఆయన రెండురోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో ప్రస్తుతం పెద్దిరెడ్డికి చికిత్స చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు అధికారులు.
 
ఇప్పటికే ఎపిలో ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. అలాగే వైసిపిలో కీలక వ్యక్తులు కరోనాతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత నాలుగు నెలల నుంచి కరోనాకు సంబంధించిన ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ మీటింగ్‌ను ఏర్పాటు చేసి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి.
 
అయితే గత నెల రోజుల్లో ముందుగా కుమారుడు మిథున్ రెడ్డికి కరోనా సోకింది. 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండి వచ్చారు మిథున్ రెడ్డి. ఆ సమయంలో మంత్రి పెద్దిరెడ్డి పరీక్ష చేయించుకుంటే నెగిటివ్ అని వచ్చింది. కానీ సరిగ్గా మూడురోజుల క్రితం కరోనా లక్షణాలు ఉండటంతో ఆయన పరీక్ష చేయించుకున్నారు.
 
దీంతో పాజిటివ్ అని వచ్చింది. రెండు రోజుల క్రితమే అపోలో ఆసుపత్రికి వెళ్ళి చేరారు. ఈ విషయాన్ని వైసిపి నేతలు గానీ, ప్రభుత్వ అధికారులు గానీ బయటకు రానివ్వలేదు. అత్యంత గోప్యంగా ఉంచారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments