Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దాపురం రాజకీయాలు.. పోటీ చేయకపోయినా అధికారం..

Webdunia
శనివారం, 20 మే 2023 (17:43 IST)
పెద్దాపురంలో డిఫరెంట్ పాలిటిక్స్ చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా అధికారం దక్కింది. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే రెండు మున్సిపాలిటీలు కలిగిన నియోజకవర్గం పెద్దాపురం ఒక్కటే. ఇక్కడ.. కాంగ్రెస్ ఆరుసార్లు, టీడీపీ ఆరుసార్లు, సీపీఐ రెండు సార్లు, పీఆర్పీ ఒకసారి గెలిచింది. 
 
గత ఎన్నికల్లో జగన్ వేవ్ బలంగా వీచినా.. పెద్దాపురంలో మాత్రం టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయ చినరాజప్పే గెలిచారు. అయితే మున్సిపల్ ఎన్నికల నాటికి.. నియోజకవర్గంలో పొలిటికల్ సీన్ మారిపోయింది. వైసీపీ బలం పుంజుకొని.. పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీను కైవసం చేసుకుంది.
 
ఇక వైసీపీలో దొరబాబు రాకతో.. పెద్దాపురం వైసీపీలో కొత్త ఉత్సాహం వచ్చిందనడంలో సందేహమే లేదు. ఇప్పుడు.. పెద్దాపురం వైసీపీ ఇంచార్జ్ కూడా ఆయనే. దాంతో పాటు రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ ఛైర్మన్‌గానూ కొనసాగుతున్నారు. దాంతో.. ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా.. గెలవకపోయినా.. అధికారం దక్కింది. ఇప్పుడంతా జనంలో తిరుగుతూ వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments