Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా 'తమ్ముడు' సిఎం అవుతాడు - మెగాస్టార్ చిరంజీవి

మెగా బ్రదర్స్ మధ్య అస్సలు సఖ్యతే లేదనేది ఒకప్పటిమాట. పవన్ కళ్యాణ్‌, చిరంజీవి అస్సలు కలవరని అనుకుంటారు. నాగబాబు కూడా ఇద్దరికీ దూరంగా ఉంటారన్న ప్రచారం సినీ పరిశ్రమలో ఎప్పటి నుంచో ఉంది. అయితే పవన్ కళ్యాణ్‌ మాత్రం అప్పుడప్పుడు తన అన్న చిరంజీవి గురించి ఎప

Webdunia
శుక్రవారం, 22 జూన్ 2018 (16:12 IST)
మెగా బ్రదర్స్ మధ్య అస్సలు సఖ్యతే లేదనేది ఒకప్పటిమాట. పవన్ కళ్యాణ్‌, చిరంజీవి అస్సలు కలవరని అనుకుంటారు. నాగబాబు కూడా ఇద్దరికీ దూరంగా ఉంటారన్న ప్రచారం సినీ పరిశ్రమలో ఎప్పటి నుంచో ఉంది. అయితే పవన్ కళ్యాణ్‌ మాత్రం అప్పుడప్పుడు తన అన్న చిరంజీవి గురించి ఎప్పుడూ మంచి విషయాలే చెబుతుంటారు. నాకు బాగా నచ్చిన వ్యక్తి మా అన్న చిరంజీవే. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొంతమంది ఇబ్బందులకు గురిచేశారు. వారిని వదిలిపెట్టనంటూ పవన్ కళ్యాణ్‌ ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు.
 
పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యల తరువాత ఒక్కసారిగా సీన్ చేంజ్ అయ్యింది. మెగాబ్రదర్స్ విడిపోలేదు... కలిసే ఉన్నారని అందరూ అనుకున్నారు. పవన్ తన అన్న చిరంజీవి గురించి మాట్లాడడం చూశాం. కానీ చిరంజీవి కూడా పవన్ గురించి మాట్లాడటం తొలిసారి ఇదే కాబోలు. సైరా నరసింహారెడ్డి షూటింగ్ జరుగుతున్న సమయంలో జనసేన పార్టీకి చెందిన కొంతమంది నాయకులు చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారట. వారు రాజకీయ నాయకులే కాదు పవన్, చిరు ఫ్యాన్స్ అసోసియేన్ నాయకులు కూడా. 
 
వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ ప్రభావం ఎన్నికల్లో ఉంటుందని జనసేన నేతలు చిరుకు చెప్పారట. అప్పుడు చిరంజీవి మాట్లాడుతూ... నా తమ్ముడు సిఎం అవుతాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అందరూ ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఒక పక్కా ప్రణాళికతో పవన్ కళ్యాణ్‌ జనాల్లోకి వెళుతున్న తీరు నాకు బాగా నచ్చింది. నా తమ్ముడికి మంచి రాజకీయ భవిష్యత్ ఉందని చిరంజీవి చెప్పారట. చిరు నోట ఆ మాట విన్న నేతలందరూ ఆశ్చర్యపోయారట. మరి మెగాస్టార్ జోస్యం నిజమవుతుందేమో చూద్దాం.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments