Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నయ్యకు ఆహ్వానం.. మరి తమ్ముడికి అందిందా.. నాగార్జున స్పెషల్.

Webdunia
బుధవారం, 29 మే 2019 (09:19 IST)
ఆంధ్రప్రదేశ్‌లో అంద‌రి దృష్టి వైకాపా చీఫ్ జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారంపైనే ఉంది. ఆయ‌న మే 30న అంగ‌రంగ వైభ‌వంగా విజ‌యవాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవం కోసం వైఎస్సార్ అభిమానులు వేయి కనులతో ఎదురుచూస్తున్నారు. 
 
ఇక ఈ ప్ర‌మాణ స్వీకార వేడుక‌కు ప‌లువురు రాష్ట్ర ముఖ్య‌మంత్రుల‌తో పాటు చంద్ర‌బాబు నాయుడుకు కూడా ఆహ్వానం అందింది. బాబుకు స్వ‌యంగా జ‌గ‌న్ ఫోన్ చేసి ఈ వేడుక‌కు రావాల‌ని ఆహ్వానించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కూడా ఈ ఆహ్వానం అందిందా అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. 
 
ఎందుకంటే ఇంత‌కు ముందు ప‌వ‌న్, జ‌గ‌న్ పెద్ద‌గా క‌లిసిన దాఖ‌లాలు లేవు. అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు మీడియా ముందు వాళ్లెప్పుడూ ప్ర‌త్య‌క్షంగా క‌లిసింది ఎక్కడా లేదు. ఇలాంటి త‌రుణంలో ప‌వ‌న్ అస‌లు ఈ వేడుక‌కు వ‌స్తారా లేదా అనేది చర్చనీయాంశమైంది
 
అలాగే మే 30న విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో మ‌ధ్యాహ్నం జ‌ర‌గ‌బోయే ప్ర‌మాణ స్వీకార వేడుక‌కు టాలీవుడ్ నుంచి చిరంజీవి, నాగార్జున‌కు ప్ర‌త్యేక ఆహ్వానం అందిన‌ట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా నాగార్జున‌కు జ‌గ‌న్ అత్యంత స‌న్నిహితుడు. పైగా ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఆయ‌న్ని వెళ్లి కలిసొచ్చారు. ప్రస్తుతం నాగార్జున, చిరంజీవి జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణ అని సినీ పండితులు అంటున్నారు. 
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments