పిఠాపురం నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్

ఠాగూర్
సోమవారం, 9 జూన్ 2025 (12:17 IST)
తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ మంచి శుభవార్త చెప్పారు. నియోజకవర్గంలో నిరుద్యోగం లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళాను నిర్వహిస్తానని ఆయన వెల్లడించారు. 
 
విజయవాడ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో పిఠాపురానికి చెందిన 325 మంది ప్రైవేటు ఎలక్ట్రీషియన్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి సేఫ్టీ కిట్లు పంపిణీ చేశారు. విద్యుత్ పనులు చేసే సమయంలో ఎలక్ట్రీషియన్లు తప్పనిసరిగా రక్షణ పరికరాలు వాడాలని సూచించారు. 
 
మల్లం గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన పల్లపు సురేశ్ అనే ఎలక్ట్రీషియన్ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందన్నారు. ఈ ఘటన గ్రామంలో స్పర్థలకుదారితీసింది. రాజకీయ లబ్దికోసం ఆలోచించేవారు ఇలాంటి గొడవలు పెద్దవి చేస్తారని, తాము మాత్రం సమస్యలను ఎలా పరిష్కరించాలో ఆలోచన చేస్తామన్నారు. 
 
గత ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్ళించారని పవన్ విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా అమలు చేసే కార్యక్రమాలను పునరుద్ధరిస్తామని డిప్యూటీ సీఎం పవన్ అన్నార. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణతేజ, కాకినాడ సబ్ కలెక్టర్ షాన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments