Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌ను వదిలేసిన ఆ ఇద్దరు... ఆ భయంతో పవన్ వణుకు?

జనసేన పార్టీ సింగిల్ హ్యాండెడ్‌గా పవన్ కళ్యాణ్ లాక్కొస్తున్నప్పటికీ ఆ పార్టీ పునాది నుంచి ఇద్దరు వ్యక్తులు వెన్నుదన్నుగా వున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు సినీ నిర్మాత, వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) కాగా మరొకరు రాజు రవితేజ్. ఇప్పుడు వీళ్లిద్దరూ పవన

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (13:37 IST)
జనసేన పార్టీ సింగిల్ హ్యాండెడ్‌గా పవన్ కళ్యాణ్ లాక్కొస్తున్నప్పటికీ ఆ పార్టీ పునాది నుంచి ఇద్దరు వ్యక్తులు వెన్నుదన్నుగా వున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు సినీ నిర్మాత, వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) కాగా మరొకరు రాజు రవితేజ్. ఇప్పుడు వీళ్లిద్దరూ పవన్ కళ్యాణ్‌కు చాలా దూరంగా వుంటున్నారట. జనసేన ఆవిర్భావ సమయంలో వీరిరువురూ ఎంతో చురుకుగా వ్యవహరించారు. కానీ క్రమంగా ఇద్దరూ పార్టీకి దూరమైపోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 
 
పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా వీరిలో ఎవరో ఒకరు ఆయన వెంట కనిపిస్తుండేవారు. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాల్గొంటూ వుండేవారు. కానీ ఇటీవలి కాలంలో వీరిద్దరూ పవన్ కళ్యాణ్ తో కటీఫ్ కొట్టారనే ప్రచారం జరుగుతోంది. కారణాలు ఏమిటో బయటకు రావడంలేదు కానీ తేడా మాత్రం వచ్చేసిందని అంటున్నారు.
 
మరోవైపు పవన్ కళ్యాణ్ చిత్రం కాటమ రాయుడు ఉగాదికి విడుదల కానుందనే సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రంతో పాటు రాజమౌళి సంచలనం బాహుబలి కంక్లూజన్ చిత్రం కూడా విడుదల కానుందని తెలుస్తోంది. ఈ రెండు చిత్రాలు ఒకేసారి విడుదలయితే పోటీ తీవ్రంగా వుంటుందని చెప్పేకంటే కాటమరాయుడుకి షాక్ ఇచ్చే చిత్రంగా నిలుస్తుందని అనుకోవచ్చంటున్నారు. దీనితో పవన్ కళ్యాణ్‌లో ఓ రకమైన టెన్షన్ మొదలైందని అంటున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments