Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ చేతిలో జగన్ టాటూ.. మండిపడుతున్న జనసైనికులు

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (12:38 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ఫోటోలపై ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇందుకు కారణం ఓ టాటూ. జనసేనాని పవన్ కల్యాణ్ తన చేతిపై ఏపీ సీఎం టాటూను వేయించుకున్నారంటూ సోషల్ మీడియాలో ఓ మార్ఫింగ్ ఫొటోను కొందరు వదిలారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇటీవల కర్నూలు, ఎమ్మిగనూరు నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఓ ఫొటోను కొందరు మార్ఫింగ్ చేశారు. ఎలాంటి టాటూ లేని పవన్ చేతిపై జగన్ ఫొటోను ఉంచారు. దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు, జనసేన ట్విట్టర్ అకౌంట్‌కు కూడా ట్యాగ్ చేసారు. ఈ మార్ఫింగ్ ఫోటోపై జనసేన అభిమానులు మండిపడుతున్నారు.
 
ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలంటూ బిజీగా వున్నారు. తాజాగా మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో పింక్ సినిమా రీమేక్ మరో 15 రోజుల్లో పూర్తి కానుంది. ఈ సినిమాతో పాటే క్రిష్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో క్రిష్ సినిమాకు సంబంధించి టైటిల్ ఒకటి బయటికి వచ్చింది. ఈ సినిమాలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నాడు. 
 
పాలమూరు పండుగ సాయన్న జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుందనే ప్రచారం జరుగుతున్న వేళ దీనికి వీరూపాక్షి అనే డిఫెరెంట్ టైటిల్ వినిపిస్తుంది. ఇందులో పవన్ పాత్ర పేరు వీర. అందుకే ఈ సినిమాకు ఇలాంటి టైటిల్ పెట్టారని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం కోసం పవన్ చాలా కష్టపడుతున్నాడు. విజువల్‌గా కూడా చాలా రిచ్‌గా ఉండబోతుంది ఈ చిత్రం. దాదాపు 100 కోట్లతో ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం కోసమే ప్రత్యేకంగా చార్మినార్, తాజ్ మహల్ సెట్స్ కూడా నిర్మించారు. 2021లో సినిమా విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments