Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ-సేవా కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆదుకోండి.. పవన్ విజ్ఞప్తి

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (19:57 IST)
పదిహేనేళ్ల నుంచి ఈ-సేవలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్నవారు ఒక్కసారి రోడ్డునపడటం చాలా బాధకరమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ఈ-సేవా ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. కరోనా విపత్తు మూలంగా లాక్‌డౌన్ విధించిన క్రమంలో ఆ ఉద్యోగులకు గత 5 నెలలుగా జీతాలు కూడా చెల్లించడం లేదన్నారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ ఈ-సేవ కేంద్రాల్లో వివిధ ఉద్యోగాల్లో 607 మంది ఉన్నారు. వీరంతా నెలల తరబడి జీతాలు రాకపోవడం మూలంగా కష్టనష్టాల్లోఉన్నారు. కుటుంబాలు పోషణకు ధీమా... ఉపాధికి హామీ లేక ఆవేదనలో ఉన్నారని పవన్ చెప్పారు. ఈ-సేవ కేంద్రాల ద్వారా సేవా రుసుముల రూపేణా రూ.వేల కోట్ల ఆదాయం కూడా ప్రభుత్వానికి సమకూరుతోంది. 
 
ఈ కేంద్రాలకు సంబంధించిన విధుల్లో ఉన్న ఉద్యోగులను ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్ (ఆప్కాస్) పరిధిలోకి తీసుకొని వారి ఉపాధికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని పవన్ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments