Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిలేష్ అందుకే ఓడిపోయారు... పవన్ కళ్యాణ్

జనసేనకు మూడు సంవత్సరాలు నిండిన సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చారు. ఆయన చెప్పినవి మాటల్లోనే...జనసేనకు అండగా ఉన్నా వారందరికీ ధన్యవాదాలు. ప్రజల్లోకి వెళ్లేందుకు 32 అంశాలను గుర్తించాం. జూన్ నుంచి పార్టీ నిర్మాణం ప్రారంభమవుతుంది. వచ్చే ఎన్నికల్

Webdunia
మంగళవారం, 14 మార్చి 2017 (21:45 IST)
జనసేనకు మూడు సంవత్సరాలు నిండిన సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చారు. ఆయన చెప్పినవి మాటల్లోనే...జనసేనకు అండగా ఉన్నా వారందరికీ ధన్యవాదాలు. ప్రజల్లోకి వెళ్లేందుకు 32 అంశాలను గుర్తించాం. జూన్ నుంచి పార్టీ నిర్మాణం ప్రారంభమవుతుంది. వచ్చే ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేస్తాం. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తాం. 60 శాతానికి మించి యువతకు సీట్లిస్తాం.
 
వచ్చే ఏడాది మార్చికి పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా ఉంటుంది. పార్టీ నిర్మాణం పూర్తయ్యాక పొత్తులపై ఆలోచిస్తాం. ఎన్నికల సంఘం నుంచి జనసేనకు గుర్తింపు ఉంది. అధికారం వచ్చినా, రాకపోయినా ప్రజలకోసం పార్టీ ఉంటుంది. సర్వేలే మాకు కొలమానం కాదు. ఏపీ నుంచే పోటీ చేస్తా కానీ ఎక్కడి నుంచి అనేది తర్వాత చెబుతా. అనంతపురం నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తా. మా పరిమితులు మాకున్నాయి... అయితే మేం చేయదల్చుకున్నది చేస్తాం. ప్రజల కోసమే పార్టీ పోరాటం... అంతిమ లక్ష్యం అధికారం కాదు.
 
ప్రజారాజ్యం పార్టీలో వివిధ వ్యక్తుల మనస్తత్వాలను చూశాను. వారంతా వ్యక్తిగత ఎజెండాలతో పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి రానివ్వకుండా కాపుకాయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికైతే ఎన్‌డీఏలో భాగస్వామిగా లేం. చంద్రబాబు పథకాలు ప్రజల్లోకి సరిగా వెళ్లడం లేదనుకుంటున్నా. అధికారంలో ఉన్నవారిని వ్యతిరేకించడం మా పని కాదు. చిరంజీవి మా పార్టీలోకి రారు. మా ఇద్దరి ఆలోచనా విధానాలు కలవవు. కుటుంబ కలహాలతోనే యూపీలో అఖిలేష్ ఓడిపోయారు అని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments