Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ సీఎం అంటూ నినాదాలు... పాదయాత్ర కాదు కారు యాత్రను కూడా చేయనివ్వరు... పవన్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉద్దానం కిడ్నీ బాధితుల విషయమై చర్చించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఉద్దానం కిడ్నీ సమస్యను వెలుగులోకి తెచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ... ఆ సమస్య మీడియా ద్వారా తెలుసుకని తన వంతు

Webdunia
సోమవారం, 31 జులై 2017 (17:16 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉద్దానం కిడ్నీ బాధితుల విషయమై చర్చించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఉద్దానం కిడ్నీ సమస్యను వెలుగులోకి తెచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ... ఆ సమస్య మీడియా ద్వారా తెలుసుకని తన వంతు కృషి చేయడంతో సమస్యకు పరిష్కారం లభిస్తోందని చెప్పారు. సమస్యను నిర్మూలించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
 
ఆ తర్వాత మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు 2 శాతం ఓట్లు కూడా రావని కొన్ని పార్టీలు అంటున్నాయే అనే ప్రశ్నకు సమాధానమిస్తూ... 2 శాతం ఓట్లు వస్తాయని చెప్పినందుకు సంతోషంగానే వుందన్నారు. కనీసం 2 శాతమైన వస్తాయని అన్నారు కదా అంటూ సెటైర్లు వేశారు. 
 
ఇకపోతే ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టబోతున్నారు... మరి మీరు కూడా పాదయాత్ర చేస్తారా అని అడిగిన ప్రశ్నకు పవన్ మాట్లాడుతూ... తను పాదయాత్ర కాదు... కనీసం కారు యాత్రను కూడా చేయనివ్వరు. రోడ్లపైకి వస్తే చుట్టేస్తారు. అందువల్ల ఏవిధంగా ప్రజల వద్దకు వెళ్లాలో ఆలోచన చేసుకుని ముందుకు వెళతానని తెలిపారు.
 
పవన్ మాట్లాడుతున్నప్పుడు కార్యకర్తలు.. పవన్ సీఎం అంటూ నినాదాలు చేశారు. అలా నినాదాలు చేస్తున్నవారిని పవన్ కళ్యాణ్ వారించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments