Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాందేవ్ బాబా 2 మినిట్స్ నూడిల్స్‌లా కాదు.. సినిమాల్ని సీరియస్‌గా తీసుకోవద్దు: పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. అందరూ అనుకున్నట్లే.. స్పెషల్ స్టేటస్‌పై పవన్ కల్యాణ్ నోరు విప్పారు. పెదవి దాటిన మాటను వెనక్కి తీసుకోవడం కష్టం అందుకే ఆచితూచి మ

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2016 (16:31 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. అందరూ అనుకున్నట్లే.. స్పెషల్ స్టేటస్‌పై పవన్ కల్యాణ్ నోరు విప్పారు. పెదవి దాటిన మాటను వెనక్కి తీసుకోవడం కష్టం అందుకే ఆచితూచి మాట్లాడుతానని చెప్పారు. సినిమాల్లో ఆస్తుల్ని దానం చేయొచ్చు, విలన్లు కొట్టొచ్చు, హీరోయిన్లతో పాటలు పాడొచ్చు. సినిమాల్లా రెండున్నర గంటల్లో అన్ని సమస్యలు పరిష్కారం కావన్నారు. రాందేవ్ బాబా 2 మినిట్స్ నూడిల్స్ పరిష్కారాలు దొరకవని, కష్టపడాలి, త్యాగాలు చేయాలని వెల్లడించారు. 
 
తిరుపతి వేదికగా బహిరంగ సభ పెట్టాల్సిన కారణాన్ని కూడా పవన్ వెల్లడించారు. తిరుపతిలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాని మోడీలతో కలిసి తొలి సభ పెట్టానని అందుకే ఇదే ప్రాంతంలో సభ పెట్టి మాట్లాడుతున్నానన్నారు. ఈ సభా ముఖంగా 3 విషయాలను చెప్పాలనుకుంటున్నానన్నారు. రాజకీయాల్లోకి తానెందుకు వచ్చానో, జనసేన ఆవిర్భావం నుంచి తాను ఎదుర్కొన్న విషయాలను, తెదేపా పనితీరును, స్పెషల్ స్టేటస్‌పై కేంద్రాన్ని నిలదీయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. 
 
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి స్పెషల్ స్టేటస్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నట్లు పవన్ తెలిపారు. తనకు రాజకీయాల మీద, సినిమాల మీద వ్యామోహం లేదని.. సమాజం మీద, ప్రజా సమస్యలను పరిష్కారంపై తనకు వ్యామోహం ఎక్కువన్నారు. జనసేన పార్టీ ఆవిర్భవించి 2 సంవత్సరాల 9 నెలలు అయ్యాయన్నారు. సినిమాను సీరియస్‌గా తీసుకోవద్దని, నిజజీవితాన్ని సీరియస్‌గా తీసుకోవాలని అభిమానులను సూచించారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments