Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో పర్యటించనున్న పవన్ కల్యాణ్.. డీసీఐకు మద్దతు

కేంద్ర ప్రభుత్వ రంగ ''డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా"(డీసీఐ) ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ‌ప‌ట్నంలోని డీసీఐ ఉద్యోగులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2017 (18:03 IST)
కేంద్ర ప్రభుత్వ రంగ ''డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా"(డీసీఐ) ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ‌ప‌ట్నంలోని డీసీఐ ఉద్యోగులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోవడంతో డీసీఐ ఉద్యోగి వెంకటేష్ విజయనగరం జిల్లా నెర్లిమర్లలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దీంతో ఆందోళన ఉద్ధృతం కావడంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డీసీఐ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపారు. బుధవారం నుంచి జరుగనున్న సమ్మెలో పవన్ పాల్గొంటారని తెలిసింది. 
 
వెంక‌టేష్ ఆత్మ‌హ‌త్య‌తో ఆందోళన తీవ్రతరమవుతున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బుధవారం పవన్ విశాఖకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా వెంకటేష్ కుటుంబాన్ని పవన్ పరామర్శిస్తారని.. ఆందోళ‌న‌కు పవన్ మద్దతు తెలుపుతారని సమాచారం. కాగా, ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖ‌ప‌ట్నంతో పాటు విజ‌య‌న‌గ‌రంలోనూ మొత్తం మూడు రోజుల పాటు ప‌ర్య‌టిస్తారు. ఈ సంద‌ర్భంగా త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తోనూ స‌మావేశం అవుతారని జనసేన పార్టీ వర్గాల సమాచారం.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments