Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి అన్యాయం.. నరేంద్ర మోడీని కలిసి నిలదీస్తా : పవన్ కళ్యాణ్

Webdunia
ఆదివారం, 1 మార్చి 2015 (14:04 IST)
కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే, వార్షిక బడ్జెట్‌లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని జనసేన పార్టీ అధినే పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి నిలదీయనున్నట్టు ఆయన ప్రకటించారు. 
 
కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిన విషయం తెల్సిందే. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. 
 
ఈ నేపథ్యంలో.. ఆదివారం ఉదయం హైదరాబాదులో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. వారిద్దరు రైల్వే, వార్షిక బడ్జెట్‌లలో ఏపీకి జరిగిన అన్యాయంపై సుదీర్ఘంగా చర్చించారు. 
 
అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి కేంద్రం కేటాయింపులు లేకపోవడం తనను నిరాశకు గురి చేసిందన్నారు. దీనిపై త్వరలో ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తానని చెప్పిన పవన్, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చిస్తానని వెల్లడించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments