Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌పై పవన్ విసుర్లు : నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.!

Webdunia
శుక్రవారం, 22 ఆగస్టు 2014 (10:20 IST)
ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేసీఆర్‌కు హితవు పలికారు. జనసేన పార్టీ బలోపెతానికై పూర్తి స్థాయిలో కసరత్తు ఇంకా ప్రారంభించలేదని గురువారం అన్నారు. సమగ్ర నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది సర్వేలో పాల్గొనడానికి పవన్ నిరాకరించినట్టుగా వస్తున్న వార్తలపై పవన్ స్పందిస్తూ ఆ రోజు తాను నగరంలో లేనని అన్నారు.
 
ముఖ్యమంత్రి కేసీఆర్ పవన్‌పై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కేసీఆర్ ఇకనైనా ద్వేషం రెచ్చగొట్టేలా మాట్లాడకూడదని నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని మంచి పాలకుడిగా ఉండమని సూచించారు.
 
తెలంగాణ-ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రుల భేటీపై స్పందిస్తూ పదవీ ప్రమాణాలు చేపట్టిన వెంటనే వీరిరువురూ ఇరు రాష్ట్రాల సమస్యలపై చర్చించుకుని ఉంటే రెండు నెలల క్రితమే ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యేవని అభిప్రాయపడ్డారు.
 
కాగా గురువారం రాత్రి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది. అయితే, ఈ విషయాలని తగిన సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తానని పవన్ కళ్యాణ్ మీడియాతో అన్నారు. 
 
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి స్టార్ కంపైనర్‌గా వ్యవహరించిన పవన్ తాజాగా అమిత్ షాతో భేటీ అవడం పలు చర్చలకు దారి తీస్తోంది. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments