వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవు: పవన్ కల్యాణ్ (video)

సెల్వి
మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (16:38 IST)
గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్వచ్ఛంధ సేవకులను నిస్సహాయ స్థితిలోకి నెట్టిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. స్వచ్ఛంద సేవకులకు సంబంధించిన అధికారిక రికార్డులు లేదా పత్రాలు లేవని, దీనివల్ల మంత్రివర్గ సమావేశాల సమయంలో మంత్రి నారా లోకేష్‌తో ఈ విషయాన్ని చర్చించే అవకాశం లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు. 
 
డుంబ్రిగుడ మండలం కురిడి గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, "గత ప్రభుత్వం వాలంటీర్లకు జీతాలు ఎలా చెల్లించిందో కూడా మాకు తెలియదు. ఈ చెల్లింపులు ఎలా జరిగాయో అర్థం చేసుకోవడానికి స్వచ్ఛంద సేవకుల నాయకులను నేరుగా ప్రశ్నించాలని నేను ప్రజలను కోరుతున్నాను" అని అన్నారు. 
 
"వాలంటీర్ల పేరుతో వారు ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టిస్తున్నట్లు చెప్పుకుని ప్రజలను మోసం చేశారు. వారు రూ.25,000 కోట్లు దోచుకున్నారు" అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రజలకు సేవ చేసే నెపంతో స్వచ్ఛంద సేవకులను నియమించుకున్నారని, బదులుగా పార్టీ సంబంధిత పనులకు ఉపయోగించుకుంటున్నారని ఆయన గత పరిపాలనను విమర్శించారు.
 
వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం వద్ద ఎటువంటి పత్రం లేదా ప్రభుత్వ ఉత్తర్వు (G.O.) అందుబాటులో లేదని ఆయన అన్నారు. "రాష్ట్రంలో అలాంటి స్వచ్ఛంద సేవకుల వ్యవస్థ ఉందని అధికారిక ఆధారాలు లేవు" అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల ఈ అంశాన్ని క్యాబినెట్ చర్చల్లోకి తీసుకురావడం అసాధ్యమని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments