క్షమించండి.. అప్పుడు విదేశాల్లో ఉన్నా.. రాలేకపోయా: పవన్

కృష్ణా జిల్లా పడవ ప్రమాద మృతుల కుటుంబాలను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా పడవ ప్రమాద మృతుల కుటుంబాలను ఒ

Webdunia
శనివారం, 9 డిశెంబరు 2017 (14:49 IST)
కృష్ణా జిల్లా పడవ ప్రమాద మృతుల కుటుంబాలను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా పడవ ప్రమాద మృతుల కుటుంబాలను ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆయన పరామర్శించారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదం జరిగిన సమయంలో తాను విదేశాల్లో ఉన్నానని.. అందుకే రాలేకపోయానని.. క్షమించాలని బాధిత కుటుంబాలతో అన్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే పడవ ప్రమాదం జరిగిందన్నారు. విహార యాత్రకు వెళ్తే విషాదం మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ప్రమాద బాధితుల బాధను అందరూ అర్థం చేసుకోవాలని.. ఎవరినీ నిందించేందుకు తాను రాలేదని పవన్ అన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు కాస్త ఊరట నిచ్చేందుకే తాను ఇక్కడి వచ్చానని చెప్పుకొచ్చారు.

పడవ ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదని, వారికి ప్రభుత్వం అండగా ఉండాలని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. నష్టపరిహారం ఇచ్చేస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అంటూ పవన్ కల్యాణ్ నిలదీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments