Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పీడు పెంచుతున్న పవన్ కళ్యాణ్ : మరో ప్రాజెక్టుకు సమ్మతం

Webdunia
శనివారం, 23 జనవరి 2021 (15:12 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడు పెంచుతున్నారు. ఒకవైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే మరోవైపు వరుస చిత్రాల్లో నటించేందుకు కమిట్ అవుతున్నారు. నిజానికి గత రెండేళ్ళుగా ఒక్క సినిమా కూడా చేయ‌ని ప‌వ‌న్ ఇప్పుడు ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి లైన్‌లో పెడుతున్నాడు. 

ఇప్ప‌టికే "వ‌కీల్ సాబ్" షూటింగ్ పూర్తి చేసిన ప‌వన్ ప్ర‌స్తుతం క్రిష్ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. దీని త‌ర్వాత మాలీవుడ్‌లో హిట్ అయిన   'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాను తెలుగులో రీమేక్  చేయ‌నున్నాడు. 

ఇందులో బిజూ మీన‌న్ పాత్ర‌ను ప‌వ‌న్ చేయ‌నుండ‌గా, రానా పాత్ర‌ను పృథ్వీరాజ్ చేయ‌నున్నాడు. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ మూవీకి త్రివిక్ర‌మ్ మాట‌లు అందించేందుకు సమ్మతించడం గమనార్హం. 

ఇదిలావుంటే, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోనూ, సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలోనూ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలు చేయ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇప్పుడు బండ్ల‌ గ‌ణేష్ నిర్మాణంలో ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మతో సినిమా చేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. 

ర‌మేష్ వ‌ర్మ ప్ర‌స్తుతం ర‌వితేజ హీరోగా 'ఖిలాడీ' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యాక ప‌వన్ సినిమా ప‌నులు మొద‌లు పెడ‌తాడ‌ట‌. ఈ లోగా పవన్ కళ్యాణ్ కూడా తాను కమిట్ అయిన చిత్రాలను పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha : త్రిష సంచలనం నిర్ణయం.. సినిమాలను పక్కనబెట్టి విజయ్‌తో పొలిటికల్ జర్నీ?

టికెట్ రేట్లు పెంచడంకంటే కంటెంట్ చిత్రాలు తీయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

సంబరాల ఏటిగట్టు సెట్ లో సాయిదుర్గ తేజ్ ఫ్యాన్స్ కు ఏంచెప్పారో తెలుసా

శివరాత్రికి ప్రజ్వల్ దేవరాజ్ రాక్షస సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం
Show comments