Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీటెక్‌ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య: పవన్ కల్యాణ్ మండిపాటు

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (22:05 IST)
గుంటూరు జిల్లాలో బీటెక్‌ విద్యార్థిని తేజస్విని వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ఆత్మహత్య చేసుకుందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు పరీక్షలు రాయనివ్వడం లేదని అన్నారు. ప్రభుత్వ విధానం కారణంగా పేద విద్యార్థులు వారి తల్లిదండ్రులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని వెంటనే ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మరణించిన తేజస్వీ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
 
ఒంగోలులో ఓ విద్యార్థిని బలవన్మరణం చెందిందన్న వార్తపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విచారం వ్యక్తం చేశారు. ఒంగోలులో బీటెక్ చదువుతున్న తేజస్విని అనే విద్యార్థిని కాలేజీ ఫీజులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకుందన్న వార్త తన మనసును కలచివేసిందని తెలిపారు. ఇది అత్యంత దురదృష్టకరమైన విషయం అని తెలిపారు. 
 
తల్లిదండ్రులకు చదివించే స్తోమత లేదన్నప్పుడు ప్రభుత్వం ఏంచేస్తోందని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఏమైందని చంద్రబాబు నిలదీశారు. నాడు నేడు అంటూ పనికిమాలిన కబుర్లు చెబుతూ విద్యావ్యవస్థను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments