Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రులు ఈ దేశ పౌరులు.. కేంద్రానికి బానిసలు కాదు... అడ్డుకుంటే యుద్ధమే : పవన్ కళ్యాణ్

విభజన చట్టం మేరకు విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. 'హోదా కోసం గురువారం విశాఖ ఆర్కే బీచ్‌లో తలపెట్టిన శాంతి

Webdunia
గురువారం, 26 జనవరి 2017 (08:24 IST)
విభజన చట్టం మేరకు విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. 'హోదా కోసం గురువారం విశాఖ ఆర్కే బీచ్‌లో తలపెట్టిన శాంతియుత నిరసనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపితే... హక్కుల కోసం ఆంధ్రులు చేసే దీర్ఘకాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... 'ఆంధ్రులు ఈ దేశ పౌరులు. కేంద్రానికి బానిసలు కాదు' అని పవన్‌ కల్యాణ్‌ గర్జించారు. 'హోదా కోసం విశాఖపట్టణం ఆర్కే బీచ్‌లో తలపెట్టిన శాంతియుత నిరసనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపితే... హక్కుల కోసం ఆంధ్రులు చేసే దీర్ఘకాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి ఎప్పుడు సహకరించాలో, ఎప్పుడు ఎదురు తిరగాలో జనసేనకు బాగా తెలుసు' అని హెచ్చరించారు. 
 
‘జల్లికట్టుకు, హోదాకు సంబంధం ఏమిటి’ అని పలువురు నేతలు అడగడంపై స్పందిస్తూ..'సంప్రదాయం కోసం తమిళులు అంత పోరాటం చేస్తున్నప్పుడు, మన అవసరాల కోసం ఇంకెంత పోరాటం చెయ్యాలి?' అని పవన్ తనను ప్రశ్నించిన వారిని సూటిగా ప్రశ్నించారు. 'ఒక ఓటు-రెండు రాష్ట్రాల పేరిట తీర్మానం తర్వాత బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా మళ్లీ ప్రత్యేక తెలంగాణ ఊసు లేదు. దాని పర్యవసానం 1458 మంది తెలంగాణ యువకుల బలిదానాలు. మీరు చెప్పుకొనే సుదీర్ఘ రాజకీయ అనుభవంమీకు నేర్పింది ఇదేనా?' అంటూ కమలనాథులకు చురకలు అంటించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments