Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఎన్టీఆర్‌లా అమాయకుణ్ని కాదు... వెన్నుపోటు పొడిపించుకునేందుకు...

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు ఘాటైన విమర్శలు చేశారు. తాను వెన్నుపోటు పొడిపించుకునేందుకు ఎన్టీఆర్‌లా అమాయకుడుని కాదంటూ స్పష్టం

Webdunia
మంగళవారం, 14 ఆగస్టు 2018 (16:07 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు ఘాటైన విమర్శలు చేశారు. తాను వెన్నుపోటు పొడిపించుకునేందుకు ఎన్టీఆర్‌లా అమాయకుడుని కాదంటూ స్పష్టంచేశారు.
 
జనసేన పార్టీ పోరాట యాత్రలో భాగంగా పవన్ ప్రసంగిస్తూ, 'వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు అలవాటు. లోకేశ్‌ కూడా వెన్నుపోటుతో సీఎం కావాలనుకుంటే కుదరదు. మీరు వెన్నుపోటు పొడుస్తుంటే పొడిపించుకునేందుకు నేను ఎన్టీఆర్‌లా అమాయకుణ్ని కాదు. వెన్నుపోటు రాజకీయాలపై జనసైన్యం తిరగబడుతుంది' అని వ్యాఖ్యానించారు. పైగా, రాబోయే సాధరణ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరుండాలి? చంద్రబాబా? జగనా? లేక నేనా? అనేది మీరే నిర్ణయించుకోండి అని వ్యాఖ్యానించారు. 
 
తెలుగుదేశం పార్టీ నేతలు లక్షన్నర కోట్లు తిన్నారని జగన్‌ విమర్శిస్తారు. అంటే రాజకీయాల్లో వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుందనేగా అర్థం. అటువంటి దోపిడీని జనసేన అరికడుతుందని పవన్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ నుంచి పారిపోవడం కాదు. ప్రశ్నించాలి! అంటూ జగన్‌ను ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments