Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ మాటలపై వాళ్లెలా స్పందిస్తారో వేచి చూస్తున్నా: పవన్ కల్యాణ్

Webdunia
సోమవారం, 25 నవంబరు 2019 (12:18 IST)
అమ్మ భాషను విస్మరిస్తే అభివృద్ధి అసాధ్యం అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితి కూడా మాతృ భాషల ప్రాధాన్యతను గుర్తించిందని ఆయన అన్నారు. 
 
ఈ ఏడాదిని అంతర్జాతీయ స్థానిక భాషల సంవత్సరంగా ప్రకటించిందని గుర్తు చేశారు. శతాబ్దాలుగా మన దేశంలో వందలాది భాషలు వికసించాయని... వీటన్నింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. ఈరోజు నుంచే మీ భాష, మీ యాసను ఉపయోగించడం ప్రారంభించండని పిలుపునిచ్చారు.
 
ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ, అంతర్జాతీయ భాషల సంవత్సరం సందర్భాన, మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రస్తావించింది విన్న జగన్ రెడ్డిగారు, మిగతా వైసీపీ సమూహం ఎలా స్పందిస్తారో విందామని వేచి చూస్తున్నానంటూ ట్వీట్ చేశారు. 
 
ప్రాథమిక విద్య స్థాయిలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టాలనుకున్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని పవన్ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎవరికి ఇష్టమైన మీడియంలో వారు చదువుకునేలా విద్యార్థులకు వెసులుబాటు ఉండాలని ఆయన సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments