Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓడిపోయిన చోట నుంచే పవన్ పర్యటనకు శ్రీకారం... తొలిసారి భీమవరంకు...

Webdunia
ఆదివారం, 4 ఆగస్టు 2019 (17:02 IST)
ఏదైనో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలంటారు మన పెద్దలు. ఈ సామెతను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బాగా ఒంటబట్టించుకున్నట్టున్నారు. ఎందుకంటే.. తాను పోటీ చేసిన ఓడిపోయిన భీమవరం నుంచే ఆయన రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఓటమి తర్వాత తొలిసారిగా భీమవరానికి పవన్ కళ్యాణ్ ఆదివారం తొలిసారి వెళ్లారు. 
 
పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 
 
ఎన్నికల ఫలితాల తర్వాత క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలను ప్రారంభించినట్టుగా పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం, భవిష్యత్‌లో పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. 
 
ఏపీ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తోంది, ప్రజలు ఏ రకమైన అభిప్రాయంతో ఉన్నారనే విషయమై ఈ సమవేశంలో చర్చించనున్నట్టుగా ఆయన తెలిపారు.
 
రాజకీయాలు హుందాగా ఉండాలని తమ పార్టీ కోరుకొంటుందని ఆయన తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్  కూడ అలాగే వ్యవహరిస్తున్నారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. వరద బాధితులను ఆదుకోవాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments