Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను తప్పు చేయకుండా ఉండటానికి కారణం భగవంతుడే : పవన్ కళ్యాణ్

తాను ఈ రోజున తప్పు చేయకుండా ఉండటానికి కారణం భగవంతుడేనని జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రముఖ తెలుగు చానెల్ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (12:38 IST)
తాను ఈ రోజున తప్పు చేయకుండా ఉండటానికి కారణం భగవంతుడేనని జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రముఖ తెలుగు చానెల్ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భగా భక్తులను ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచీ నాకు భగవంతుడు అంటే చాలా భయం. ఎప్పుడూ, తప్పు చేస్తే ఏదైనా చేస్తారనే భయమే నన్ను జాగ్రత్తగా ఉంచింది అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఈ రోజున తప్పు చేయకుండా ఉండటానవికి కారణం భగవంతుడే అని తేల్చి చెప్పారు.
  
నా దృష్టిలో భగవంతుడు అంటే ధర్మాన్ని కాపాడటం అని నమ్ముతాను. నాకు భగవంతుడు అంటే ఏంటంటే అడిగినవి ఇచ్చేవాడు కాదు.. మనకి అవసరమైనవి ఇచ్చేవాడు అని నమ్ముతాను. అలాంటి భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అన్నారు పవన్ కళ్యాణ్.
 
కాగా, హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో భాగంగా 13వ రోజు భక్తులతో మహాగణపతికి కోటి గరికార్చన, కాణిపాకం వరసిద్ధి వినాయకుడి కల్యాణం, లంబోదరుడి మూషికవాహన సేవ జరిగాయి. నవంబర్ 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న ఈ వేడుకల్లో భాగంగా నిత్యం వివిధ ప్రత్యేక పూజలతో వివిధ దేవుళ్లని ఆరాధిస్తూ కోటీ దీపోత్సవం కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments