Webdunia - Bharat's app for daily news and videos

Install App

చమన్ కుమారుడు ఉమర్‌ను ఎంబీబీఎస్ చదివిస్తా : సీఎం చంద్రబాబు హామీ

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దివంగత పరిటాల రవి ప్రధాన అనుచరుడు అనంతపురం జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ చమన్ కుమారుడు ఉమర్ ముక్తాను ఎంబీబీఎస్ చదివిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ

Webdunia
మంగళవారం, 8 మే 2018 (14:34 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దివంగత పరిటాల రవి ప్రధాన అనుచరుడు అనంతపురం జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ చమన్ కుమారుడు ఉమర్ ముక్తాను ఎంబీబీఎస్ చదివిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు చమన్ మొదటి భార్య రమీజాబీకి ఆయన హామీ ఇచ్చారు.
 
చమన్ గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. పరిటాల రవి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న చమన్ మృతిపట్ల పరిటాల అభిమానులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ పరిస్థితుల్లో చమన్ భార్య రమేజాబీతో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి ఆమెను ఓదార్చారు. చమన్ కుటుంబానికి అండగా ఉంటామని, చమన్ చిరకాలవాంఛ అయిన ఆయన కుమారుడు ఉమర్ ముక్తాను ఎంబీబీఎస్ చదివిస్తానని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. 
 
ఇదిలావుండగా, చమన్ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం ఆయన స్వగ్రామమైన రామగిరి మండలం ఆర్. కొత్తపల్లిలో జరిగాయి. ఈ అంత్యక్రియలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, పరిటాల రవి అభిమానులు పాల్గొన్నారు. రామగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో గల చమన్ వ్యవసాయ భూమిలో అంత్యక్రియలను నిర్వహించారు. 
 
ఈ అంత్యక్రియల్లో రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, వరదాపురం సూరి, బీకే పార్థసారథి, ఎంపీ నిమ్మల కిష్టప్ప, అంత్యక్రియలకు పరిటాల రవి కుటుంబసభ్యులతో పాటు భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments