జగన్‌కు అహం తలకెక్కింది.. రోజాకు అమరావతిలో అభివృద్ధి కనిపించట్లేదా? (video)

Webdunia
సోమవారం, 20 జనవరి 2020 (14:53 IST)
వైసీపీ పతనం మొదలైంది.. అమరావతిలో అభివృద్ధి రోజాకు కనిపించడం లేదా..? అంటూ టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. ఆర్కే రోజా ఓసారి కళ్లను పరీక్ష చేయించుకోవాలని ఆమె సైటైర్లు విసిరారు. ప్యాకేజీల కోసమే రోజా చౌకబారు వ్యాఖ్యలు చేస్తోందని ఫైర్ అయ్యారు. వైసీపీ వేసిన కమిటీలకు చట్టబద్ధత లేదని చెప్పారు. 
 
అవినీతి కేసుల్లో ఉన్న మీకు టీడీపీపై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి అహంకారం తలకెక్కిందని అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసుల మాఫీ కోసమే జగన్ రోడ్లు పట్టుకుని తిరిగారని, ఏడు నెలల్లో రాష్ట్రంలో జరిగిన అత్యాచారాల సంఖ్య రోజాకు తెలుసా? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. 
 
ప్రజాగ్రహానికి భయపడే దొడ్డి దారిన రోడ్లు వేయించుకున్నారని మండిపడ్డారు. నగరి ప్రజలు రోజా నార తీసేశారు, రాష్ట్రంలో ప్రాంత, మత, కుల విద్వేషాలు రగిల్చారు. రాబోయే రోజుల్లో టీడీపీ 170 సీట్లు గెలుస్తుందని.. వైసీపీ పతనం ఖాయమని ఆమె స్పష్టం చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments