Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచాయతీ పోల్‌పై కరోనా పంజా.. ఎన్నికలు వాయిదా

Webdunia
ఆదివారం, 15 మార్చి 2020 (10:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్ భయంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే విదేశాలకు వెళ్లి వచ్చిన 6644 మందికి 14 రోజుల క్వారంటైన్ ఆదేశాలను ప్రభుత్వం జారీచేసింది. అంటే 6644 మంది తమతమ ఇళ్లనుంచి బయటకు రావడానికి వీల్లేందు. అలాగే, ఆదివారం మరో 40 లక్షల గృహాల్లో కరోనా సర్వే నిర్వహించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ కూడా అసాధ్యంగా మారింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 
 
కరోనా ప్రభావం ఎన్నికలపైనా ఉందని, ఎలక్షన్ సమయాల్లో ప్రచారం, పోలింగ్ సందర్భంగా ప్రజలు పెద్దఎత్తున సమూహంలా చేరే అవకాశాలు ఉన్నందున ఆరు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేశ్ కుమార్ ప్రకటించారు.
 
వాస్తవానికి కరోనాతో ఎన్నికలకు ఇబ్బంది రాదని ముందు భావించామని అయితే, కేంద్రం కూడా కరోనాను జాతీయ విపత్తుగా గుర్తించిందన్న ఆయన, స్థానిక ఎన్నికలను వాయిదా వేయడానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు. 
 
అత్యున్నత స్థాయి సంప్రదింపులు జరిపి, పరిస్థితులను మదింపు చేసి, ప్రభుత్వ ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత తిరిగి ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments