Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మంత్రంటే అమ్మాయిలకి చచ్చేంత ఇష్టం.....!

ఆయన మినిస్టర్.. కానీ టాప్‌ హీరో కంటే ఎక్కువ పబ్లిసిటీ ఉందని తెలిసింది. విద్యార్థుల్లో అంత క్రేజ్‌ను చూసిన ఆయన ఒక్కసారిగా బిత్తరపోయారు. తిరుపతిలోని పద్మావతి మెడికల్‌ కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఓ కార్యక్

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (15:22 IST)
ఆయన మినిస్టర్.. కానీ టాప్‌ హీరో కంటే ఎక్కువ పబ్లిసిటీ ఉందని తెలిసింది. విద్యార్థుల్లో అంత క్రేజ్‌ను చూసిన ఆయన ఒక్కసారిగా బిత్తరపోయారు. తిరుపతిలోని పద్మావతి మెడికల్‌ కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఓ కార్యక్రమానికి వైద్య, ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్‌ హాజరయ్యారు. కార్యక్రమం అయిపోయిన వెంటనే వచ్చిన విఐపిలతో ఫోటోలు దిగడం కామన్‌.. కానీ మెడికల్‌ కళాశాల అమ్మాయిలు మంత్రి కామినేనితో సెల్ఫీ దిగడానికి ఎగబడ్డారు. ఒకానొక దశలో ఆయన మీదకు తోసుకుని వెళ్ళిపోవడంతో గోడ చివర వరకు వెనక్కి వెనక్కి వెళ్ళిన కామినేని చివరకు రెండు చేతులు పైకెత్తి నిలబడ్డాడు. 
 
అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గని అమ్మాయిలు తన సెల్లులు పట్టుకుని మంత్రితో ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డ కామినేనిని కళాశాల అమ్మాయిలు మరోసారి చుట్టుముట్టారు. సర్‌.. ఒక్క ఒక్క ఫోటో అంటూ మంత్రిగారు చేసేదేమీ లేక కొద్ది సేపు అలానుంచున్నారు. ఒకరిద్దరు ఫోటోలు తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఎలాగోలా భయపడి హమ్మయ్య అనుకున్నారు మంత్రి కామినేని. అయితే ఇదంతా చూసిన కళాశాల ప్రొఫెసర్ల, మీడియా ప్రతినిధులు అబ్బా మంత్రి గారికి ఇంత ఫాలోయింగ్‌ ఉందా అని ఆశ్చర్యపోయారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ 12 చిత్రానికి కింగ్‌డమ్ టైటిల్.ఖరారు, యుద్ధం నేపథ్యంగా టీజర్

మెగా ఫ్యామిలీ హీరోలకు 'పుష్పరాజ్' దూరమైనట్టేనా? చెర్రీ అన్‌ఫాలో..

నటుడు పృధ్వీ ఆసుపత్రి పాలు కావడానికి వారే కారణం !

బద్మాషులు మన ఊరి కథ : రచ్చరవి

సుబ్రమణ్యేశ్వర స్వామియే నన్ను పిలిపించుకున్నారు :విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments