మాది పేద రాష్ట్రం .. పెట్టుబడులకు అవకాశం ఉంది : సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (16:52 IST)
హైదరాబాద్‌ వంటి నగరం ఏపీకి లేదని, తమది పేద రాష్ట్రమని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్నారు. భారత విదేశాంగ శాఖ సమన్వయంతో విజయవాడలో జరుగుతున్న డిప్లొమాటిక్ ఔట్‌రీచ్‌ సదస్సులో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సదస్సుకు యూఎస్‌ఏ, యూకే, కెనడా, జపాన్‌, కొరియా, సింగపూర్, ఆస్ట్రేలియా సహా 35 దేశాల హైకమిషనర్లు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయన్నారు. ఏపీలో సుస్థిర ప్రభుత్వం ఉందని, అలా ఉంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు. ఏపీలో 4 నౌకా పోర్టులు, ఆరు విమానాశ్రయాలు ఉన్నాయని జగన్ చెప్పారు. ఏపీకి అపారమైన కోస్తా ప్రాంతం ఉందన్నారు. టెండర్ల నుంచి కేటాయింపుల దాకా అవినీతి రహిత నిర్ణయాలను తీసుకుంటున్నామని జగన్ అన్నారు. విజయవాడలో డిప్లొమాటిక్ ఔట్‌రీచ్ సదస్సు నిర్వహణకు సహకరించిన కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

Vishwak Sen.: విశ్వక్ సేన్.. ఫంకీ థియేటర్ డేట్ ఫిక్స్

Pre-Wedding Show Review: హాయిగా నవ్వుకునేలా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments