Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యో... కె.ఎ.పాల్‌ను ఆ దోమ కుట్టిందట

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (21:15 IST)
కె.ఎ.పాల్. ఎన్నికల ముందు ప్రజా శాంతి పార్టీ పెట్టి జనంలోకి వెళ్ళిన కె.ఎ.పాల్ చేసిన హడావిడి గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా కె.ఎ.పాల్ పేరు మార్మోగిపోయింది. ప్రధాన పార్టీలైన టిడిపి, వైసిపి, జనసేనలకు పోటీగా ప్రజాశాంతి పార్టీని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఒకే ఒక్కడుగా పార్టీలో ఉంటూ కొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టారు.
 
ఇదంతా ఒక ఎత్తయితే ఎన్నికల తరువాత కె.ఎ.పాల్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఒకే ఒక్క సీటు కూడా గెలవకపోవడం.. చివరకు కె.ఎ.పాల్ నామినేషన్‌ను ఒకచోట తీసుకోకపోవడం ఆ పార్టీని, కె.ఎ.పాల్‌ను లేవలేని స్థితిలోకి తీసుకెళ్ళింది. ఆ తరువాత కె.ఎ.పాల్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. పార్టీ గురించి అస్సలు చర్చలేదు. ఎప్పుడైనా యు ట్యూబ్‌లలో వీడియోలు చూస్తే మాత్రం జనం కె.ఎ.పాల్ అంటూ కాసేపు నవ్వుకుంటుంటారు.
 
అయితే అలాంటి కె.ఎ.పాల్‌ను డెంగ్యూ దోమ కుట్టిందట. డెంగ్యూ ఫీవర్‌తో కె.ఎ.పాల్ గత మూడురోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారట. ప్లేట్‌లెట్ ఒక్కసారిగా పడిపోయి సన్నగా అయిపోయారట కె.ఎ.పాల్. అస్సలు గుర్తుపట్టలేని విధంగా కె.ఎ.పాల్ తయారయ్యారట. తనను కలవడానికి ఎవరినీ రావద్దని కె.ఎ.పాల్ ఇప్పటికే చెప్పడమే కాకుండా తన సెల్‌ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments