Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా కోసం ఆగిన గుండె... మరొకరి మృతి

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2015 (08:10 IST)
ఏపీకి ప్రత్యేక హోదా కోసం మదనపడ్డ మరోవ్యక్తి గుండె ఆగి మరణించారు. ప్రత్యేక హోదాపై తదేకంగా ఆలోచిస్తున్న ఆయన మరణంతో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా అరకులోయలోని పద్మాపురం నివాసి కేత చంద్రశేఖర్(47) ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ శనివారం చేపట్టిన బంద్‌లో చురుగ్గా పాల్గొన్నాడు. సాయంత్రం ఇంటికి వెళ్లి ప్రత్యేక హోదా రాదేమోనని ఆందోళన చెందాడు.
 
అసలు హోదా వస్తుందో రాదో అంటూ మదనపడుతూ పడుకున్నాడని, అర్ధరాత్రి గుండెలో నొప్పిగా ఉందంటూ లేచి కూర్చున్నాడని చంద్రశేఖర్ భార్య అమ్మలు తెలిపారు. స్థానికుల సాయంతో వెంటనే అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక హోదాకు అనుకూలంగా లేకపోవడంపై చంద్రశేఖర్ బాధపడేవాడని గ్రామస్తులు చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments