Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్థానిక పోరుకు అధికారుల సన్నద్ధం

Webdunia
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (08:04 IST)
పురపాలక, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.

డిసెంబరు మార్చి మధ్య ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ రెండు ఎన్నికల్నీ ఒకేసారి నిర్వహించాలా...? లేక వే వేరుగా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్రంలోని 12,918 పంచాయతీల్లో సర్పంచుల పదవీకాలం గత ఏడాది ఆగస్టు ఒకటితో ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది.

సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు తాజాగా ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని నోటీసులు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్ల అమలుపై... సుప్రీంకోర్టు తదుపరి ఎన్నికల్లో 50 శాతానికి పరిమితం చేయాలని ఆదేశించింది.

రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేస్తే ఎన్నికల నిర్వహణకు వీలుగా ఇప్పటికే పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు, జిల్లాల్లో బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేశామని అధికారులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments