Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజకొస్తే రూ.2 లక్షలిస్తాం... 6 అడుగుల మహిళకు గాలం.. క్షుద్రపూజల కోసం

అర్థరాత్రి వేళ ఎవరి కంటపడకుండా మంత్రతంత్రాలతో క్షుద్రశక్తులను పూజిస్తూ, వాటి సాయంతో అనుకున్న వ్యక్తికి కీడు చేయడాన్నే చేతబడి అంటారు. అలాంటి క్షుద్ర పూజల కోసం ఆరడుగులు మహిళను కావాలని కోరి చివరికి కటకటా

Webdunia
శుక్రవారం, 15 జులై 2016 (09:16 IST)
అర్థరాత్రి వేళ ఎవరి కంటపడకుండా మంత్రతంత్రాలతో క్షుద్రశక్తులను పూజిస్తూ, వాటి సాయంతో అనుకున్న వ్యక్తికి కీడు చేయడాన్నే చేతబడి అంటారు. అలాంటి క్షుద్ర పూజల కోసం ఆరడుగులు మహిళను కావాలని కోరి చివరికి కటకటాల పాలయ్యారు. ఈ ఘటన చింతకాని మండలం ప్రొద్దుటూరు మండలంలో చోటుచేసుకుంది. 
 
ఆ వివరాలను పరిశీలిస్తే... ఇదే గ్రామానికి చెందిన ఓర్స్ బాలకృష్ణ బోనకల్‌కు చెందిన ఆటో డ్రైవర్ భూక్యా సైదాకు... క్షుద్ర పూజల కోసం ఆరడుగుల ఎత్తు ఉన్న మహిళ కావాలని చెప్పాడు. బోనకల్ కస్తూర్బా పాఠశాలలో వంటమనిషి వద్ద హెల్పర్‌గా పనిచేస్తున్న శ్యామల రేణుక గురించి అతనికి గుర్తుకువచ్చింది. శ్యామల సరిగ్గా ఆరడుగులు ఉంటుందని చెప్పడంతో ఈ పూజకు ఆవిడ సరిపోతుందని భావించాడు. 
 
దీంతో కృష్ణాజిల్లా వత్సవాయి మండలం చిట్యాలకు చెందిన పెరుగు వెంకటరమణ, కొణిజర్ల మండలం దిద్దుపూడి గ్రామానికి చెందిన పుట్టా లక్ష్మిలతో కలిసి ఓర్స్ బాలకృష్ణ శ్యామల రేణుక వద్దకు వెళ్లారు. మంచి కోసం పూజలు చేస్తున్నాము... పూజకు తప్పకుండా రావాలని, అలా వస్తే రూ.2 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇలా రావడానికి భయంగా ఉంటే భర్తతో కలిసి రావొచ్చని ఆమెను నమ్మించారు. 
 
వారి మాటలకు అనుమానం వచ్చిన రేణుక వెంటనే కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్‌కు విషయాన్ని వివరించి చెప్పారు. ఆమె బోనకల్ ఎస్సై కుమారస్వామికి సమాచారం అందించారు. ఆయన సిబ్బందితో కలిసి రేణుక ఇంట్లో ఉన్న పెరుగు వెంకటరమణ, పుట్టా లక్ష్మి, భూక్యా సైదా, ఓర్స్ బాలకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ఇతరుల కోసం పోలీసులుస గాలింపు చర్యలు చేపట్టారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments