Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు ఎయిడ్స్ వచ్చింది... ఎంజాయ్ చేయాలనుకున్నా... ఓబులేసు

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (20:47 IST)
కేబీఆర్ పార్కు వద్ద పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డి కిడ్నాప్‌కు ప్రయత్నించి పట్టుబడిన ఓబులేసు రిమాండ్ రిపోర్టులో అతడు ఇచ్చిన వాంగ్మూలం వెలికి వచ్చింది. ఈ రిపోర్టులోని వివరాలు ఇలా ఉన్నాయి. తనకు ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్ వచ్చిందనీ, అందువల్ల అంతిమ జీవితాన్ని ఎంజాయ్ చేసేందుకు ఇలా అక్రమంగా డబ్బు సంపాదించేందుకు కిడ్నాప్ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపాడు.
 
గ్రేహౌండ్స్లో 12 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించిన తాను ఏకే 47ను దొంగిలించడానికి కారణం కూడా ఇదేనంటూ వెల్లడించాడు. 2014 ఫిబ్రవరి 19న ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడిని అపహరించాననీ, ఆ యువకుడి తల్లిదండ్రుల నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు చెప్పాడు. కేబీఆర్ పార్కుకు వాకింగ్ కోసం ప్రతిరోజూ డబ్బున్న వాళ్లు కార్లలో రావడం చూసి వారి కార్లలోకి ప్రవేశించి యజమానిని బెదిరించి డబ్బులు గుంజాలని యత్నించేవాడినని చెప్పాడు. నిత్యానందరెడ్డి సీటు బెల్టు పెట్టుకుంటున్న సమయంలో ఆయన కారులో దూరి ఏకే 47తో బెదిరించానట్లు తెలిపాడు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments