Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోనసీమ జిల్లాలో దళిత బాలికకు అవమానం - చికిత్స కోసం వెళితో కాలితో తొక్కి...

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2023 (10:20 IST)
ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దళిత బాలికకు ఘోర అవమానం జరిగింది. చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ దళిత బాలికను నర్సు కాలితో తొక్కి పరీక్షిస్తూ అవమానించింది. ఈ ఘటన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని కాట్రేనికోనకు చెందిన నేలపాటి భాస్కర రావు తన పదేళ్ల మనవరాలు కాలినొప్పితో బాధపడుతుంటే ఆదివారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. అయితే, అక్కడున్న నర్సు మణికుమారి మాత్రం చిన్నారి కాలును తన కాలితో తొక్కి పరీక్షించింది. పైగా, చికిత్స ఏమీ చేయకుండానే అమలాపురం ఆస్పత్రికి తీసుకెళ్లాని సూచించింది. 
 
దీంతో నర్సుపై భాస్కర రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగిని అవమానించినందుకు పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో నర్సు క్షమాపణ చెప్పింది. కాగా, సదరు నర్సు డిప్యుటేషన్‌పై తమ ఆస్పత్రిలోనే పని చేస్తుందని వైద్యురాలు నిఖిత తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments