Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహానాడుకు రాని ఎన్టీఆర్ కుటుంబీకులు.. పార్టీ శ్రేణుల్లో మొదలైన చర్చ?

మహానాడుకు టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కుటుంబీకులు ఎవ్వరూ హాజరు కాలేదు. తద్వారా ఏపీ సీఎం చంద్రబాబుకు ఎన్టీఆర్ ఫ్యామిలీ షాక్ ఇచ్చారని రాజకీయ పండితులు అంటున్నారు. ప్రతీ ఏడాది మేలోసతెలుగుదేశంపార్టీ మహాన

Webdunia
సోమవారం, 29 మే 2017 (09:08 IST)
మహానాడుకు టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కుటుంబీకులు ఎవ్వరూ హాజరు కాలేదు. తద్వారా ఏపీ సీఎం చంద్రబాబుకు ఎన్టీఆర్ ఫ్యామిలీ షాక్ ఇచ్చారని రాజకీయ పండితులు అంటున్నారు. ప్రతీ ఏడాది మేలోసతెలుగుదేశంపార్టీ మహానాడు నిర్వహిస్తుంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జన్మదినమైన మే 28న మహానాడు జరుగుతుంది. ఇది ఆరంభం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఈ మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తప్పక హాజరవుతుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులెవరూ మహానాడుకు హాజరు కాలేదు.   
 
ఎన్టీఆర్ కుటుంబం నుంచి మహానాడుకు తప్పకుండా హాజరయ్యే హరికృష్ణ కూడా ఈసారి మహానాడు రాలేదు. ఇక మరో కుమారుడు నందమూరి బాలకృష్ణ ఏకంగా తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నా మహానాడుకు మాత్రం ఈసారి హాజరుకాలేదు. బాలయ్య మాత్రం తాను విదేశాల్లో సినిమా షూటింగ్ లో ఉన్నందువల్ల రాలేకపోయానని వివరణ ఇచ్చుకున్నారు.
 
గతంలో మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ , తారకరత్న వచ్చేవారు. రెండు, మూడేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు రావడం మానేశారు. దీంతో పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైంది. చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబాన్ని పక్కనబెట్టేందుకు రంగం  సిద్ధం చేస్తున్నారా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments